ENGLISH

రానా 'నెం.1' దూకుడు!

01 September 2017-16:28 PM

నెం.1 యారీ ప్రోగ్రామ్‌తో బుల్లితెరపై రానా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఏకంగా బుల్లితెరపై బిగ్‌ షో అయిన ఎన్టీయార్‌ బిగ్‌బాస్‌తో పోటీపడుతున్నాడు. వీకెండ్స్‌లో తారక్‌ రెండు రోజులు కనిపిస్తోంటే, ఒక్కరోజే అయినా రానా ఆ కాస్సేపు మెస్మరైజ్‌ చేస్తున్న తీరు అభినందనీయం. అరేే అప్పుడే అయిపోయిందే యారీ అనుకుంటున్నవాళ్లూ లేకపోలేదు ఈ ప్రోగ్రాంకి. అంతగా టైం తెలీయకుండా చేసేస్తున్నాడు ఆడియన్స్‌కి రానా. ఉన్నది గంట సేపే అయినా విపరీతంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోంది ఈ ప్రోగ్రాం. ఈ షోలో గెస్ట్‌ల పాత్ర కూడా చాలా కీలకం. వారిని ఎంచుకోవడంలో తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు రానా. ఒక్క గెస్ట్‌ వస్తేనే పండగ అనుకుంటారు ఆడియన్స్‌. అలాంటిది ఇద్దరిద్దరిని తీసుకొచ్చి, వారితో సరదా సరదా ఆటలాడించి, సరదా సరదా డైలాగులు చెప్పించి, రానా నవ్వుతూ, ఆడియన్స్‌నీ విశేషంగా నవ్వుల లోకంలోకి తీసుకెళ్తున్నాడు. అలా 'నెం1 యారీ' ప్రోగామ్‌ మంచి విజయాన్ని అందుకుంటోంది. ఇద్దరు గెస్ట్‌లు, వారితో రానా ముచ్చట్లు ఆ ఇద్దరు గెస్ట్‌ల మధ్య స్నేహం ఇతరత్రా అనేక విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. అంతేకదా సెలబ్రిటీస్‌ వ్యక్తిగత విషయాలంటే అభిమానులకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్‌నే మరింత ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నాడు రానా. ఆ రకంగా ఈ ప్రోగ్రాంకి వీకెండ్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బుల్లితెరపై ఇంతవరకూ ఇలాంటి ప్రోగ్రాంస్‌ చాలానే వచ్చాయి. కానీ వాటన్నింట్లోకీ రానా 'నెం. 1 యారీ' ప్రత్యేకంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్