అనసూయ.. ఎప్పుడైనా టాక్ ఆఫ్ ది టౌనే. బుల్లి తెర అయినా, వెండి తెర అయినా - తనదైన ఫాలోయింగ్ తో చిచ్చు రేపుతుంటోంది. ఈమధ్య క్రేజీ సినిమాల్లో నటిస్తూ - తన క్రేజ్ మరింత పెంచుకుంటోంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా మరింత పాపులర్ అయిన అనసూయ.. `పుష్ష`లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్ సంపాదించింది.
మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా `లూసీఫర్`. తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇది వరకు `ఆచార్య`లో అనసూయ నటిస్తుందన్న వార్తలొచ్చాయి. కానీ `ఆచార్య` ఆఫర్ వచ్చినట్టే వచ్చి, చేజారింది. ఈసారి మాత్రం చిరు పక్కన నటించడం ఖాయమైంది. మరి... ఈ సినిమాలో అనసూయ పోషించే పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
ALSO READ: Anasuya Latest Photoshoot