ENGLISH

ఇప్పుడు చాలామారానంటోన్న అన‌సూయ‌

25 March 2021-12:24 PM

అన‌సూయ అంటేనే గ్లామ‌ర్‌. గ్లామ‌ర్ అంటేనే అన‌సూయ‌. త‌న క‌ట్టూ బొట్టూ, మాట తీరు.. ఇవ‌న్నీ కుర్ర‌కారుకి భ‌లే న‌చ్చేస్తాయి. అయితే అన‌సూయ‌కు కోపం కూడా ఎక్కువే. త‌న ఆవేశాన్ని అస్స‌లు కంట్రోల్ చేసుకోలేదు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌చ్చే కామెంట్ల‌ని కూడా సీరియ‌స్ గా తీసుకుంటుంది. ట్రోల్స్ చేసేవాళ్ల తోలు తీస్తుంటుంది. అలా.. ర‌చ్చ‌కెక్కిన సంద‌ర్భాలు అనేకం. వాటివ‌ల్ల అన‌సూయ‌కే ఎక్కువ డామేజ్ జ‌రిగింది.

 

ఈ విష‌యాన్ని తాను కూడా గ్ర‌హించిన‌ట్టుంది. అందుకే ఈమ‌ధ్య బాగా మారింది. ``అవును.. నేను చాలా మారాను. ఇది వ‌ర‌కు ప్ర‌తీ చిన్న విష‌యానికీ స్పందించేదాన్ని. న‌న్ను హేళ‌న‌గా చూసేవాళ్ల‌కు గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల‌నుకునేదాన్ని. దాంతో.. నాకు చెడే ఎక్కువ జ‌రిగింది. ఈ పాఠాల నుంచి చాలా నేర్చుకున్నా. బుర‌ద‌లో రాయి వేయ‌డం వ‌ల్ల మ‌న‌కే న‌ష్టం అని గ్ర‌హించా. అందుకే అలాంటి కామెంట్ల‌ని లైట్ తీసుకోవ‌డం మొద‌లెట్టా`` అంది.

ALSO READ: Anasuya Latest Photoshoot