ENGLISH

హాట్‌ యాంకర్‌ స్వీట్‌ డాక్టర్‌.!

26 October 2018-13:42 PM

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుని, వెండితెరపై అప్పుడప్పుడూ మెరుపుతీగలా మెరిసిపోతున్న రష్మీ గౌతమ్‌కి హెల్త్‌ ప్రాబ్లెమ్‌ ఉండేది చిన్నప్పుడు. ఇమ్యూన్‌ సమస్య అది. చిన్నప్పుడు తీవ్రంగా వేధించేదట ఆ సమస్య. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ ఎంతోకొంత ఆ సమస్య కారణంగా ఇబ్బంది ఎదురవుతూనే ఉంది రష్మీకి. 

ఓ సందర్భంలో అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం గురించి చెప్పింది రష్మి. దాంతో అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న కొంతమంది అభిమానులు ఆ సమస్య నుండి బయటపడడమెలా.? అని రష్మీని సలహాలు అడుగుతున్నారు. దానికి రష్మీ తనకు చేతనైన, తాను పాఠించిన కొన్ని సలహాలు ఇస్తోంది. ఆ సలహాలు వారికి ఉపయోగకరంగానే ఉంటున్నాయి. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడంలాంటి చిన్న చిన్న చిట్కాలన్న మాట అవి. 

ఇదంతా బాగానే ఉంది. కానీ రష్మీ ఇచ్చే ఈ చిరు సలహాల మీద కొందరు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 'డాక్టర్‌ రష్మీ' అంటూ ఎగతాళి చేస్తున్నారు. సమస్య వెటకారం చేసేంత చిన్నది కాదని అలాంటి వారికి కాస్త ఘాటుగానే సమాధానమిచ్చేస్తోంది ఈ బుల్లితెర బ్యూటీ. వెండితెరపై అందాల ఆరబోత విషయంలో అస్సలు మొహమాటపడకుండా రెచ్చిపోవడం రష్మీకి కొత్తేమీ కాదు. 

బుల్లితెరపై ఎప్పుడూ చలాకీగా కనిపించే రష్మీకి ఇంత తీవ్రంగా వేధించే ఇలాంటి అనారోగ్య సమస్య వుందంటే నమ్మగలమా.?

ALSO READ: టీఆర్ఎస్ కోసం.. అర్జున్ రెడ్డి!