ENGLISH

డైరెక్ష‌న్ మానేసి.. న‌ట‌న వైపు వ‌చ్చేస్తాడ‌ట‌

06 June 2022-10:07 AM

అనిల్ రావిపూడి... అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు. వ‌రుస‌గా అన్నీ సూప‌ర్ హిట్లే. ఎఫ్ 3 కూడా వంద కోట్ల మైలు రాయిని అందుకుంది. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు తిరుగులేదు. అయితే త‌న‌లో చాలా క‌ళ‌లున్నాయి. రావిపూడి మంచి డాన్స‌ర్‌. న‌టుడు కూడా. త‌న సినిమాల్లోనే చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తుంటాడు. త‌న‌కు పూర్తి స్థాయి న‌టుడిగా మారాల‌ని ఉంద‌ట‌. కానీ ఇప్పుడు కాదు.

 

``నాకు న‌ట‌న అంటే ఇష్టం. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించాల‌ని ఉంది. అయితే ఇప్పుడు కాదు. నా సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవుతూ.. `ఇక చాల్లే.. సినిమాలు తీయ‌కు` అని ప్రేక్ష‌కుల చేత అనిపించుకొన్న‌ప్పుడు... డైరెక్ష‌న్ వ‌దిలేసి, న‌ట‌న‌ని వృత్తిగా ఉంచుకొంటా. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోతా`` అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. త్వ‌ర‌లోనే బాల‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంది. సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రులో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

ALSO READ: 'మేజర్' కి పాన్ ఇండియా రెస్పాన్స్ ఏది ?