ENGLISH

లోక నాయ‌కుడా.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు?!

06 June 2022-11:00 AM

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌కి ఎట్ట‌కేల‌కు ఓ హిట్టు ప‌డింది. అది కూడా మామూలు హిట్టు కాదు. సూప‌ర్ హిట్టు. విక్ర‌మ్ రూపంలో. విక్ర‌మ్ సినిమాకి తెలుగు నాట ఎబౌబ్ ఏవ‌రేజ్ రివ్యూలు వ‌చ్చాయి. త‌మిళంలో మాత్రం ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తొలి మూడు రోజుల వ‌సూళ్లూ బీభ‌త్సంగా ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ పాత్ర రికార్డుల‌ దుమ్ము దులిపేసింది విక్ర‌మ్. తెలుగులోనూ మంచి వ‌సూళ్లే దొరుకుతున్నాయి.

 

క‌మ‌ల్ కి ఓ హిట్టు ప‌డ‌డం చాలా అవ‌స‌రం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ప‌రిత‌పిస్తున్నాడు క‌మ‌ల్‌. ద‌శావ‌తారం రూపంలో క‌మ‌ల్ కి హిట్టొచ్చింది. విశ్వ‌రూపం మంచి సినిమానే. కానీ వ‌సూళ్లు పెద్ద‌గా రాలేదు. విక్ర‌మ్ అలా కాదు. మేకింగ్ ప‌రంగా బాగానే ఖ‌ర్చు పెట్టినా, విశ్వ‌రూపం, ద‌శ‌వ‌తారం లాంటి భారీ బ‌డ్జెట్ సినిమా కాదు. కాబ‌ట్టి... నిర్మాత‌గా క‌మ‌ల్ సేఫ్ గేమ్ ఆడిన‌ట్టు లెక్క‌. ఓవ‌ర్సీస్‌లోనూ విక్ర‌మ్ కి భారీ వ‌సూళ్లు అందుతున్నాయి. అక్క‌డ బీస్ట్ రికార్డుల్ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. త్వ‌ర‌లోనే విక్ర‌మ్ 2 కి కూడా రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు టాక్‌.

ALSO READ: 'మేజర్' కి పాన్ ఇండియా రెస్పాన్స్ ఏది ?