ENGLISH

ఓటీటీ విడుదల: యానిమల్ కు కోర్టు షాక్

20 January 2024-11:34 AM

బాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా సునామి సృష్టించిన 'యానిమల్' మూవీకి ఓటీటీ  కష్టాలు ఎదురయ్యాయి.  రణబీర్‌ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, సందీప్ వంగా డైరక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర  900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఖాన్ ల రికార్డ్ ని మొదటి సారి కపూర్ తిరగరాశాడు. తండ్రి-కొడుకుల  మధ్య సెంటిమెంట్ బేస్ చేసుకుని ఉన్న ఈ కథకి  ఆడియన్స్ బానే కనెక్ట్ అయ్యారు. కొని సీన్స్ పై అబ్యంతరాలున్నా, తీవ్ర విమర్శలు వచ్చినా, వసూళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రణభీర్ కపూర్ కెరియర్లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బాబీ డియోల్  సెకండ్ ఇన్నింగ్స్ కి  గ్రాండ్ వెల్కమ్ లభించింది. అలాంటి ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్  అవుతుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు.


ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది.  రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్ కానుంది అని వార్తలు వచ్చాయి. తరవాత అంత కంటే ముందే స్ట్రీమింగ్ అని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి  టైమ్ లో ఓటీటీలో ఈ మూవీ విడుదలకు సంబంధించి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ‘యానిమల్’ మూవీని  టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ కలిసి నిర్మించాయి. ఈ మూవీ ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సినీ1 స్టూడియోస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ శాటిలైట్‌ రైట్స్ విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని, అయితే, వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు అందలేదని, తనకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరింది.


ఈ నేపథ్యంలో నెట్‌ ఫ్లిక్స్‌ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై  జనవరి 20 లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.