ENGLISH

డార్లింగ్ తో రౌడీ హీరో

20 January 2024-14:10 PM

ఆది పురుష్ తో డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రభాస్,  ‘సలార్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 2023  లోనే ఒక డిజాస్టర్ , ఒక భారీ హిట్ తో జోరు మీదున్న ప్రభాస్  ‘కల్కి 2898ఎ.డి’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంకో వైపు మారుతి డైరక్షన్ లో వస్తున్న మూవీ కూడా షూటింగ్ జరుగుతోంది. కల్కి ని మహానటి లాంటి మూవీ తెరకెక్కించి నేషనల్ అవార్డు కొట్టేసిన  నాగ్‌ అశ్విన్‌  తెరకెక్కిస్తున్నాడు. ఇది పాన్‌ ఇండియా సినిమా. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ లాంటి స్టార్స్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ క్యాస్ట్  ఉన్న ఈ మూవీలో ఇప్పుడు కొత్తగా  విజయ్‌ దేవరకొండ పేరు కూడా యాడ్ అయ్యింది. రౌడీ హీరో ఈ  చిత్రంలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం.


ప్రజంట్ విజయ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ కి నాగ్ అశ్విన్ కి ఉన్న అనుబంధం కారణంగా విజయ్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాక్. గతంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించి, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కల్కి లో కూడా విజయ్ నటిస్తుండటంతో ప్రభాస్క ఫాన్స్, విజయ్ ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.


సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ‘కల్కి..’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే  ఈ సినిమా నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది . ఈ మూవీని సీ అశ్వనీదత్‌  500 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.