ENGLISH

అన్నీ మంచి శకునములే’ టీజర్.. కూల్

06 March 2023-09:32 AM

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని వదిలారు. ఓ అందమైన హిల్ స్టేషన్ లో రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ల జోడి కొత్తగా వుంది. రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నరేష్, షావుకారు జానకి ఇలా సినియర్ నటులంతా తెర నిండుగా కనిపించారు.

 

నందిని రెడ్డి, కృష్ణ వంశీ టైపులో ఓ ఫ్యామిలీ ఎంటర్ ని తీర్చిదిద్దారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. విజువల్ కూల్ గా వున్నాయి. ఫన్ , రోమాన్స్, ఎమోషన్స్ అన్నీ కనిపించాయి. మిక్కీ జే మేయర్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. మే 18న సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు.