ENGLISH

తెలుగు నేర్చుకుంటున్నా: అను ఇమ్మాన్యుయేల్‌

06 March 2017-18:34 PM

క్యూట్‌ అండ్‌ హాట్‌ భామ అను ఇమ్మాన్యుయేల్‌ ఇటీవలే 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ చేతిలో గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' సినిమాతోపాటుగా పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించే సినిమా ఒకటుంది. తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల పరంగా, డిమాండ్‌ పరంగా చూసుకుంటే అను ఇమ్మాన్యుయేల్‌ 'క్లౌడ్‌ 9'లో ఉంది అని చెప్పవచ్చు. ఈ భామకి పవన్‌కళ్యాణ్‌తో అవకాశమొచ్చిందంటేనే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడిపోవాలనే ఆలోచనతో ఉందట ఈ బ్యూటీ. మలయాళ సినీ రంగంలోంచి తెలుగులోకి వచ్చి, తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న తనకు తెలుగు సినీ పరిశ్రమలో వాతావరణం బాగా నచ్చిందని చెప్పింది. తెలుగు నేర్చుకుంటున్నాననీ ఇప్పుడిప్పుడే కొన్ని పదాలు తెలుస్తున్నాయనీ మాట్లాడలేకపోతున్నప్పటికీ ఇతరులు మాట్లాడేది తనకు అర్థమవుతుందని ఆమె వివరించింది. భాష తెలిస్తే నటన తేలికవుతుందని నటనతోపాటు డబ్బింగ్‌ కూడా చెప్పుకోగలిగితే అది నటనకు పరిపూర్ణత వచ్చినట్లు తాను భావిస్తానంటోంది అను ఇమ్మాన్యుయేల్‌ అది నిజమే కదా.

ALSO READ: Qlik Here For Anu Emmanuel Latest Photos