'సూపర్' సినిమాతో స్వీటీ బ్యూటీ అనుష్క తెలుగు తెరకు పరిచయమైంది. క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాతో అనుష్కని తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు. కెరీర్ తొలి నాళ్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అనుష్క ఇమేజ్‌ని అమాంతం మార్చేసిన సినిమా 'అరుంధతి'. ఆ సినిమా నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి.
'ఈ పాత్ర నువ్వు చేయగలవు, నువ్వు తప్ప ఇంకొకరితో ఈ సినిమాని ఊహించుకోలేం..' అని ఆ రోజు శ్యాం ప్రసాద్ రెడ్డి నన్ను ప్రోత్సహించకపోతే ఈ రోజు నా గురించి ఇంతలా మాట్లాడుకునేవారు కాదు.. అంటోంది ముద్దుగుమ్మ అనుష్క. అందుకే తన జీవితంలో పూరీ జగన్నాధ్, శ్యాం ప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వెరీ వెరీ స్పెషల్ అంటోంది. డైరెక్టర్ పూరీ జగన్నాధ్ నుండి తాను చాలా నేర్చుకున్నానంటోంది. కథలు ఎంపిక చేసుకోవడం, కెరీర్ ప్లాన్ చేసుకోవడం తదితర విషయాలు తాను పూరీ నుండే నేర్చుకున్నాననీ అనుష్క చెబుతోంది.
అలాగే 'సైజ్ జీరో' సినిమా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందనీ, వాస్తవానికి లవ్స్టోరీస్ని తాను ఎక్కువగా ఇష్టపడుతుంటాననీ, అయితే అనుకోకుండా థ్రిల్లర్స్ చేసే అవకాశం వస్తోందనీ అంటోంది. నిజానికి థ్రిల్లర్స్ అంటే అనుష్కకి అస్సలు ఇష్టముండదట. ఇక పెళ్లి విషయం ఏంటని అడిగితే.. పెళ్లికొడుకుని చూసి పెట్టమంటోంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటుందట స్వీటీ. ప్రస్తుతం 'భాగమతి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ 'సంచల' పాత్రలో అనుష్క కనిపించనుంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ భాగమతిగా ఎలా మారిందన్నదే 'భాగమతి' స్టోరీ. త్వరలోనే ఈ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ALSO READ: GST పైన అమ్మాయిలతో ఆర్జీవీ హాట్ డిబేట్