ENGLISH

పెళ్లి.. పిల్ల‌లు.. రెండూ ఇష్ట‌మే!

03 November 2020-17:18 PM

టాలీవుడ్ కి పెళ్లి క‌ళ వ‌చ్చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అంతా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇటీవ‌లే కాజ‌ల్ కీ పెళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన మిగిలిన క‌థానాయిక‌ల ద‌గ్గ‌రా `పెళ్లి` ప్ర‌స్తావ‌న వ‌స్తోంది. అనుష్క కైతే.. పెళ్లీడు వ‌చ్చి ... దాటేస్తోంది కూడా. చాలా కాలంగా అనుష్క పెళ్లి గురించిన వార్త‌లొస్తూనేఉన్నాయి. కానీ... ఆ వార్త‌లెప్పుడూ నిజం కాలేదు. అస‌లు నిజానికి అనుష్క‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా? లేదా? లేదంటే ఇలానే బ్ర‌హ్మ‌చారిణిగా ఉండిపోతుందా? అనే అనుమానాలూ వ్య‌క్తం అయ్యాయి.

 

పెళ్లిపై అనుష్క మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది. ``నాకు వివాహ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంది. పెళ్లి చేసుకోవ‌డం, పిల్ల‌ల్ని క‌న‌డం రెండూ ఇష్ట‌మే. జీవితంలో అవి భాగాలు. త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటా. కానీ అదెప్పుడో చెప్ప‌లేను. 20 ఏళ్ల నుంచీ.. మా ఇంట్లో పెళ్లికి తొంద‌ర చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం పెద్ద‌గా అడ‌గ‌డం లేదు. నన్ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని అనుకున్నారో ఏమో, ఆ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం లేదు. త‌గిన సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటా. కానీ... అప్పుడు కూడా న‌టిగా కొన‌సాగుతా`` అని క్లారిటీ ఇచ్చేసింది.

ALSO READ: Anushka Latest Photoshoot