లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచింది అనుష్క. అయితే ఆమె కెరీర్ కొంతకాలంగా స్థబ్దుగా ఉంది. కొత్తగా ఏ సినిమానీ ఒప్పుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఆమెకు ఓ సినిమా బాగా నచ్చిందని, ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుందన్నది టాలీవుడ్ టాక్.
నయనతార తమిళంలో నటించిన తాజా చిత్రం `నేట్రికన్`. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా చూసిన అనుష్క... తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యిందట. ఓ నిర్మాతకు చెప్పి.. రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేయించిందని టాక్. అయితే... నెట్రికన్ కి ఆదరణ అంతంత మాత్రమే. పైగా.. ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. అలాంటి కథని అనుష్క తెలుగులో ఎలా రీమేక్ చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. అయితే కొంతమంది మాత్రం `నెట్రికన్`లోని పాయింట్ మాత్రమే తీసుకుని, ఆ కథని పూర్తిగా మారుస్తారని, అందుకే అనుష్కతో రీమేక్ చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఏదేమైనా.. అనుష్కకి మళ్లీ సినిమాలు చేయాలన్న ఉత్సాహం వచ్చింది. అది చాలు. మరి నెట్రికన్ ని ఎవరు కొన్నారో? ఎవరు డైరెక్ట్ చేస్తారో? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
ALSO READ: గోవాకి షిఫ్ట్ అయిపోతున్న చైతూ - సమంత