మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పయునుమ్ కోషియమ్ ని తెలుగులో `భీమ్లా నాయక్`గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకుడు. పవన్ - రానా కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవల భీమ్లా నాయిక్ నుంచి ఓ చిన్న టీజర్ వచ్చింది. అయితే ఆ టీజర్ లో పవన్ పాత్రని మాత్రమే హైలెట్ చేశారని, మరో కీలకమైన పాత్రధారి, ఇంకో కథానాయకుడు రానా ని అస్సలు పట్టించుకోలేదని, ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించలేదని విమర్శలొచ్చాయి. ఈ సినిమాని పవన్ సినిమా అనే బ్రాండ్ తోనే తీస్తూ.. రానాకి అన్యాయం చేస్తున్నారని జనం గోల చేస్తున్నారు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు చిత్రబృందం మరో టీజర్ విడుదల చేయడానికి రెడీ అయ్యిందట. ఈసారి.. రానా పాత్రని మాత్రమే హైలెట్ చేస్తూ, ఈ టీజర్ ని తీస్తారట. ఇందులో రానా డానియల్ శేఖర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రని పరిచయం చేస్తూ, ఈ టీజర్ ని విడుదల చేస్తున్నారని, ఇప్పటికే టీజర్ ని కట్ చేశారని, త్వరలోనే బయటకు వదులుతారని టాక్. ఈ టీజర్ తో అయినా విమర్శకుల నోళ్లు మూతపడతాయేమో చూడాలి.
ALSO READ: గోవాకి షిఫ్ట్ అయిపోతున్న చైతూ - సమంత