టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ వంక చూస్తోంది. పాన్ ఇండియా హడావుడి పెరిగింది కదా. మార్కెట్ ని పెంచుకోవాలనో, బాలీవుడ్ వాళ్లకు టచ్‌లో ఉండాలనే ముంబైకి మకాం మార్చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇల్లు ఉన్నా, ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుని అప్పుడప్పుడూ అక్కడకి వెళ్లొస్తున్నారు. అలా అందరూ ముంబై మాయలో పడిపోతే.. నాగచైతన్య, సమంత మాత్రం గోవా వెళ్లిపోతున్నారు. అవును.. త్వరలోనే చైతూ, సమంత గోవా షిఫ్ట్ అవుతున్నారని ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇటీవల గోవాలో బీచ్ పరిసరాల్లో ఓ ఖరీదైన స్థలాన్ని చైతూ, సమంత కొనుగోలు చేశార్ట. సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ స్థలంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకుని, అక్కడే సెటిల్ అయిపోవాలని ఈ జంట భావిస్తోంది. ప్రస్తుతానికి ఫామ్ హోస్‌కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని 2022 నాటికి... వీరిద్దరూ మకాం గోవాకి మార్చేస్తారని తెలుస్తోంది. సమంత - చైలకు గోవా ఫేవరెట్ హాలిడే స్పాట్. అక్కడ ఓ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ కల ఇలా తీరిందన్నమాట.
ALSO READ: చిరు - మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా?