శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై టాలీవుడ్ ఎప్పుడో దృష్టి పెట్టింది. తనని ఎలాగైనా తెలుగు సినిమాలో హీరోయిన్ గా చూడాలని అందరి ఆశ. మహేష్‌బాబు - త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా జాన్వీ పేరు పరిశీలించారు. కానీ కుదర్లేదు. ఎన్టీఆర్ సినిమా కోసం కూడా జాన్వీ పేరు గట్టిగా వినిపించింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. అయితే ఈసారి అల్లు అర్జున్ తో జాన్వీ జోడి తప్పకుండా కుదురుతుందని, ఈ విషయంలో తిరుగులేదన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్.
అల్లు అర్జున్ హీరోగా `ఐకాన్` రూపొందనున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకుడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయికగా జాన్వీ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే మహేష్, ఎన్టీఆర్ ల సినిమాలకే నో చెప్పిన.. జాన్వీ బన్నీ సినిమాని ఒప్పుకుంటుందా? అనేది అనుమానం. కానీ ఇక్కడ ఉంది.. దిల్ రాజు. ఆయనకు బోనీ కపూర్ తో మంచి అనుబంధం ఉంది. వకీల్ సాబ్ సినిమాకి బోనీ సహ నిర్మాత. ఆ చనువుతోనే.... జాన్వీ ని ఒప్పిస్తారన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం దిల్ రాజు - బోనీకపూర్‌ల మధ్య మంతనాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయానికి వస్తారని టాక్.
ALSO READ: చిరు - మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా?