వెండి తెరపై కొన్ని కాంబినేషన్లు ఎవర్ గ్రీన్. హిట్లూ ఫ్లాపులతో దానికి సంబంధం ఉండదు. ఆ కాంబో ఎప్పుడు చూసినా ప్రేక్షకులకు ఓ థ్రిల్ కలుగుతుంది. అలాంటి కాంబినేషన్ రవితేజ - శ్రీనువైట్ల. నీ కోసం దుబాయ్ శీను, వెంకీ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు. అయితే..ఈ కాంబోలో వచ్చిన 4వ సినిమా `అమర్ అక్బర్ ఆంటోనీ` అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తరవాత.. శ్రీనువైట్ల మరీ డల్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో.. శ్రీనువైట్లకు రవితేజ మరో ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.
రవితేజ కోసం శ్రీనువైట్ల ఓ కథ సిద్ధం చేస్తున్నాడని, కథ నచ్చితే, శ్రీనుకి డేట్లు ఇస్తానని రవితేజ మాట ఇచ్చాడని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం డీ అండ్ డీ తీస్తున్నాడు రవితేజ. విష్ణు ఇందులోహీరో. ఈ సినిమా చేస్తున్నప్పుడే మరో రెండు కథల్ని సిద్ధం చేశానని శ్రీనువైట్ల ఆమధ్య చెప్పుకొచ్చాడు. అందులో ఓ కథ రవితేజ కోసమన్నమాట. మహేష్ కోసం కూడా శ్రీనువైట్ల ఓ కథ రెడీ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. డీ అండీతో శ్రీను తనని తాను నిరూపించుకుంటే కచ్చితంగా రవితేజ నుంచి పిలుపు వస్తుంది. అప్పటి వరకూ వెయిట్ అండ్ సీ.
ALSO READ: చరణ్‌తో తమన్నా?!