ENGLISH

అనుష్క వెయిటింగ్‌

10 March 2017-15:52 PM

ముద్దుగుమ్మ అనుష్క ఈ మధ్య పలు భారీ చిత్రాల్లో నటించింది. కానీ ఏ చిత్రమూ ఆమెకి సంతృప్తికరమైన విజయాన్ని అందించలేకపోయింది. తాజాగా వచ్చిన 'సింగం 3', 'నమో వేంకటేశాయ' చిత్రాలు కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేకపపోయాయి స్వీటీ బ్యూటీకి. ఆ లోటు త్వరలో రానున్న 'బాహుబలి' సినిమా తీర్చనుందని భావిస్తోంది. అందుకే అనుష్క ఆశలన్నీ 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాపైనే పెట్టుకుందట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో అనుష్క పాత్ర చాలా చిన్న పాత్ర కావడం, అందులోనూ అది డీ గ్లామర్‌ రోల్‌ కావడంతో, ఈ పార్ట్‌లో హీరోయిన్‌గా మొత్తం మార్కులు మిల్కీ బ్యూటీ తమన్నా కొట్టుకెళ్లిపోయింది. కానీ రెండో పార్ట్‌ మొత్తం అనుష్కదే అంటున్నారు. గ్లామర్‌ విషయంలోనైనా, వీరత్వం ప్రదర్శించడంలోనైనా అనుష్క పాత్ర కీలకంగా ఉండనుందట రెండో పార్ట్‌లో. అందుకే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ని అందుకోవాలని ఆశిస్తోంది. తొలి పార్ట్‌కే ప్రపంచ ఖ్యాతి పొందింది ఈ చిత్రం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. జక్కన్న ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఇదో కారణం అనుష్క వెయిటింగ్‌కి. ఈ సినిమాతో ఖచ్చితంగా అనుష్క సక్సెస్‌ కొట్టడం ఖాయమే అంటున్నారు అంతా. మరో పక్క అనుష్క వరుసగా సీనియర్‌ హీరోలతో జతకట్టడానికి రేస్‌లో ముందున్న ఆప్షన్‌ అయ్యింది. అన్నట్లు మరో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ 'భాగ్‌మతి'లో కూడా అనుష్కే హీరోయిన్‌గా నటిస్తోంది.