ENGLISH

హ‌మ్మ‌య్య‌... టాలీవుడ్ బెంగ తీరింది

12 January 2022-15:48 PM

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో కొత్త సినిమాల సంద‌డి క‌నిపించ‌బోతోంది. బంగార్రాజుతో స‌హా ఓ అర‌డ‌జ‌ను చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటికి ఒక‌టే టెన్ష‌న్‌. ఆంధ్రాలో నైట్ క‌ర్‌ఫ్యూ ఉంది. దానికి తోడు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న అమ‌లులో ఉంది. దాంతో సంక్రాంతి వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని భ‌యం. అన్ని సినిమాల మాటెలా ఉన్నా `బంగార్రాజు`కి ఈ బెంగ ఉంది. అయితే అది కాస్త తీరిపోయింది.


ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న స‌వ‌రించారు. సంక్రాంతి సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీతో ఆడించుకోవ‌చ్చ‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నిజంగా సంక్రాంతి సినిమాల‌కు ఇది శుభ‌వార్తే. ఆంధ్రాలో రాత్రి 11 గంట‌ల నుంచి నైట్ క‌ర్‌ఫ్యూ అమ‌లులో ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టుగా షో టైమింగ్స్ మారుతున్నాయి. సెకండ్ షో రాత్రి 8 గంట‌ల‌కు మొద‌లై.. 10.30కి ముగుస్తుంది. అలా.. నాలుగు షోలూ ప్ర‌ద‌ర్శించుకునే వెసులు బాటు దొరికిన‌ట్టే. అయితే ఈ ఆఫ‌ర్ సంక్రాంతి అయ్యేంత వ‌ర‌కే అని స‌మాచారం. 

ALSO READ: శ్యామ్ సింగ‌రాయ్‌.. పెట్టిందెంత‌? వ‌చ్చిందెంత‌?