ENGLISH

శ్యామ్ సింగ‌రాయ్‌.. పెట్టిందెంత‌? వ‌చ్చిందెంత‌?

12 January 2022-10:35 AM

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. డిసెంబ‌రులో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి రివ్యూలొచ్చాయి. చాలామంది సెల‌బ్రెటీలు ఇదో క్లాసిక్ అంటూ మెచ్చుకున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీలు కూడా ఈ సినిమా బాగుంద‌ని కితాబిచ్చారు. అయితే... బాక్సాఫీసు ద‌గ్గ‌ర రిజ‌ల్ట్ రివ‌ర్స్ లో ఉంది. ఈ సినిమా అర‌కొర వ‌సూళ్లే అందుకుంది. మూడు వారాల‌కు గానూ దాదాపు 22 కోట్లు తెచ్చుకుంది. నైజాంలో 8 కోట్లు, సీడెడ్ లో 2.4 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 2 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్లో 3.4 కోట్లు సాధించింది.


ఈ సినిమాకి దాదాపు 55 కోట్లు అయిన‌ట్టు టాక్‌. నాని కెరీర్‌లో అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. శాటిలైట్, ఓటీటీ, డిజిట‌ల్ రూపంలో దాదాపు 22 కోట్లు వ‌చ్చాయ‌ట‌. అంటే.... నిర్మాత‌కు జేబులోంచి ప‌ది కోట్లు ప‌డ్డాయ‌న్న‌మాట‌. ఏపీలో టికెట్ రేట్లు త‌గ్గ‌డం ఈ సినిమాపై చాలా ప్ర‌భావాన్ని చూపించింది. మ‌రోవైపు పుష్ప‌, అఖండ‌లకు థియేట‌ర్ల‌లో ఆడేస్తున్నాయి. అందుకే.. శ్యామ్ సింగ‌రాయ్ వ‌సూళ్లు అంతంత మాత్రంగానే వ‌చ్చాయి. మొత్తానికి వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా యావ‌రేజ్ స్థాయిలోనే ఆగిపోయింది. 

ALSO READ: ఒమెక్రాన్ ఎఫెక్ట్‌: స్టూడియోల‌కు తాళాలు