ENGLISH

ఇదీ ట్విస్ట్‌ అంటే: అనూహ్యంగా దూసుకొస్తోన్న అరియానా.!

15 December 2020-17:00 PM

అబిజీత్‌కి సోషల్‌ మీడియాలో వున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షో నాలుగో సీజన్‌ వరకు చూసుకుంటే, అబిజీత్‌కి వచ్చినన్ని ఓట్లు, హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ ఎవరికీ ఇప్పటిదాకా రాలేదు. ఆ లెక్కన, అబిజీత్‌ చాలా ఈజీగా టైటిల్‌ విన్నర్‌ అయ్యేందుకు అవకాశం వుంది. కానీ, ఫినాలెకి ముందు ఆసక్తికరమైన ఘట్టాలు తెరపైకొస్తున్నాయి.

 

ఇప్పటిదాకా పోటీ అబిజీత్‌ వర్సెస్‌ అఖిల్‌.. అని అంతా అనుకున్నారు. అయితే, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఐదో స్థానంలో వున్న అరియానా, అనూహ్యంగా దూసుకొస్తోంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ప్రకారం చూసుకుంటే అబిజీత్‌, అరియినాల పేర్లే ఎక్కువగా 'హ్యాష్‌ ట్యాగ్స్‌' రూపంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు లెక్కలు చూసుకున్నా అబిజీత్‌ చాలా ముందంజలో వున్నాడు.

 

అయితే, అరియానా చాలా వేగంగా తన ఇమేజ్‌ని పెంచుకుంటోంది. 'జెన్యూనిటీ' కేటగిరీలో అబిజీత్‌ తర్వాత ఆమెకే ఎక్కువ మార్కులు పడుతుండడం గమనార్హం. ఈ ఇద్దరి తార్వాతి స్థానంలో సోహెల్‌ పేరు విన్పిస్తోంది. హారిక - అఖిల్‌ ఇద్దరూ దాదాపు సమానంగా ఓట్లు రప్పించుకుంటున్నారు. ఫినాలె రేసులో తొలుత ఎంటర్‌ అయిన అఖిల్‌, దాదాపుగా ఐదో స్థానానికి పడిపోయాడిప్పుడు ఫాలోయింగ్‌ పరంగా. నిజానికి, అఖిల్‌ ఏనాడూ సోలోగా ఓట్లను రాబట్టుకున్నది లేదన్నది చాలామంది అభిప్రాయం. ఇవన్నీ జస్ట్‌ సోషల్‌ మీడియా లెక్కలే. బిగ్‌బాస్‌ మనసులో ఏముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ALSO READ: ర‌వితేజ‌కు భ‌లే ఛాన్సులే!