ENGLISH

ఆ ఆంటీతో పెళ్లి ఇప్పుడప్పుడే కాదట.!

25 April 2019-17:30 PM

గతకొంతకాలంగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌కపూర్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటి మలైకా అరోరా ప్రేమాయణం గురించి కథలు కథలుగా కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య ఏదో మొక్కుబడిగా ఈ విషయంపై మలైకా రెస్పాండ్‌ అయ్యింది. కానీ అర్జున్‌కపూర్‌ మాత్రం రెస్పాండ్‌ కాలేదు. అయితే మలైకా - అర్జున్‌కపూర్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనీ, అర్జున్‌ కపూర్‌ ఫ్యామిలీకి కూడా వీరి వివాహం ఇష్టమేననీ ప్రచారం తాజాగా వైరల్‌ అవుతోంది. దాంతో ఈ విషయమై ఎట్టకేలకు అర్జున్‌కపూర్‌ పెదవి విప్పాడు. 

 

'ఆమె నాకెంతో ప్రత్యేకం కానీ, పెళ్లి మాత్రం ఇప్పుడప్పుడే కాదు..' నేనింకా చిన్న పిల్లాడినే జస్ట్‌ 33 ఇయర్స్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు పాపం అర్జున్‌కపూర్‌. అప్పుడే చాలా రోజులుగా వీరిద్దరూ ప్రేమించుకోవడం, డేటింగ్‌లో ఉండడం పార్టీలకూ, పబ్‌లకూ కలిసి మెలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అర్జున్‌కపూర్‌ తాజా రెస్పాన్స్‌తో, పెళ్లి మాట వచ్చేసరికి నాకు జస్ట్‌ 33 ఇయర్సే అని అర్జున్‌ కపూర్‌కి వయసు గుర్తొచ్చినట్లుంది.. అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

 

అయినా ప్రేమ, పెళ్లి అనేది ఎవరికి వారికే వారి పర్సనల్‌. అనవసరమైన అత్యుత్సాహం చూపించడం సబబు కాదు. ప్రస్తుతం తన దృష్టి కెరీర్‌ పైనే.. అంటున్నాడు అర్జున్‌ కపూర్‌. ప్రస్తుతం అర్జున్‌ 'పానిపట్‌', 'ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని అర్జున్‌ క్లారిటీ ఇవ్వడంతో, ఆయన చుట్టూ వైఫైలా అల్లుకున్న ఈ రూమర్స్‌కి ఇకపై చెక్‌ పడుతుందేమో చూడాలిక. 

ALSO READ: ర‌ష్మిక‌.... ఎంత అడిగితే అంత ఇస్తున్నారు మ‌రి!