ENGLISH

అవెంజర్స్‌ ముందు 'మహర్షి' వెలవెలబోతోందా.?

25 April 2019-16:30 PM

త్వరలో విడుదల కావాల్సిన సూపర్‌ స్టార్‌ మూవీ 'మహర్షి' గురించి మాట్లాడుకోవాలి అంతా. ఆడ్వాన్స్‌ బుకింగ్స్‌, ఆన్‌లైన్‌ బుకింగ్స్‌, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. అంటూ 'మహర్షి' సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది పోయి, ఓ హాలీవుడ్‌ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందిప్పుడు. ఏకంగా ఈ సినిమా టికెట్ల కోసం యూత్‌, ఉద్యోగులు, సమ్మర్‌ హాలీడేస్‌తో స్కూళ్లకు బైబై చెప్పిన విద్యార్ధులు.. ఆ మాటికొస్తే, కొందరు ఫ్యామిలీ ఆడియన్స్‌.. ఇలా అందరూ మాట్లాడుకొనేది ఆ హాలీవుడ్‌ సినిమా గురించే. అంత క్రేజ్‌ ఏర్పడింది సడెన్‌గా ఈ సినిమాపై. 

 

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే, 'అవెంజర్స్‌ ది ఎండ్‌ గేమ్‌'. థానోస్‌ని ఎదిరించి సూపర్‌మేన్‌, బ్యాట్‌ మేన్‌, స్పైడర్‌ మేన్‌.. ఇలాంటి సూపర్‌ హీరోల సినిమాలుకు క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ స్థాయిలో క్రేజ్‌.. అంటే ట్రేడ్‌ పండితులకే దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఓ హాలీవుడ్‌ మూవీ కోసం ఇంత మాట్లాడుకోవడమంటే ఇదే తొలిసారేమో కూడా. అవెంజర్స్‌ సిరీస్‌లో వస్తున్న లాస్ట్‌ సినిమా కావడమే ఈ సినిమాకి ఇంత క్రేజ్‌ తెచ్చిపెట్టిందో ఏమో కానీ, విదేశాల్లో ఆల్రెడీ ఈ సినిమాకి 'ఆసమ్‌' అనే టాక్‌ రావడంతో ఓ స్టార్‌ హీరో సినిమా విడుదలైతే నెలకొనే సందడిని మించిన సందడి నెలకొంది ఈ సినిమా విడుదలయ్యే ధియేటర్స్‌ ముందు. 

 

సహజంగా పిల్లలే ఇలాంటి సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ మీడియం ఏజ్డ్‌ ఆంటీలు, ఓ మోస్తరు అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా క్యూల్లో నిలబడి టికెట్ల కోసం ఎదురు చూడడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ హడావిడి చూస్తుంటే, వచ్చే వారం విడుదల కాబోయే 'మహర్షి' సినిమా పరిస్థితేంటో. కానీ ఇప్పటికే యంగ్‌ హీరో నిఖిల్‌ సినిమాని పక్కన పెట్టేశారీ సూపర్‌ హీరోల దెబ్బకి.

ALSO READ: 'ఆర్ఆర్ఆర్‌'కి ఆమె ఫిక్సయ్యిందా.?