ENGLISH

అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ .. ఫిక్స్

20 June 2022-10:03 AM

విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అర్జునే చేస్తున్నారు.

 

ఈ సినిమాతో ఐశ్వర్య అర్జున్‌ని తెలుగులో కథానాయికగా పరిచయం చేస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది రోడ్ ట్రిప్ చిత్రం. విశ్వక్ సేన్‌ను అర్జున్ విలక్షణమైన పాత్రలో చూపించనున్నారు. మల్టీ ట్యాలెంటడ్ స్టార్లయిన విశ్వక్ సేన్, అర్జున్‌లది చాలా ఆసక్తికరమై కాంబినేషన్. ఇద్దరు మంచి నటులు. ఇద్దరు దర్శకులు. ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై సహజంగానే ఆసక్తిపెరిగింది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ALSO READ: మ‌రో ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌