ENGLISH

అర్జున్ రెడ్డిని సినిమాని మీ కంప్యుటర్ లో చూడొచ్చు!

03 September 2017-13:55 PM

అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకులని స్టన్ చేసిన దర్శక-నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తమ కంప్యుటర్స్ లో స్వయంగా చూసుకునే విధంగా ప్లాన్ చేశారు.

అదేంటంటే- డిజిటల్ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు వెబ్ సిరీస్ లకి కూడా మంచి ఆధరాణే దక్కుతున్నది, ఇది గమనించిన సినీప్రముఖులు తమ చిత్రాలని కూడా డిజిటల్ గా ప్రేక్షకులకి అందించే పనిని మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే అర్జున్ రెడ్డి చిత్రాన్ని రూ 1 కోటి 60 లక్షలకి అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ల్స్ చేస్తుండగా ఇక రాబోయే కాలంలో వెబ్ లోను అర్జున్ రెడ్డి సంచలనం రేపనుంది.

సో... అర్జున్ రెడ్డి మీ కంప్యూటర్స్ లో...

 

ALSO READ: చైతుకి రాకీ షాక్ ఇచ్చిన సమంతా!