ENGLISH

మే 17న 'అర్జున్‌ సురవరం' అయినా అనుమానమే?

01 May 2019-14:37 PM

కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న 'అర్జున్‌ సురవరం' విడుదల కావాల్సి ఉంది. కానీ హాలీవుడ్‌ మూవీ 'అవెంజర్స్‌' దెబ్బకి ఈ సినిమాని విడుదల చేయలేమని డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేయడంతో 'అర్జున్‌ సురవరం' రిలీజ్‌ డేట్‌ అయోమయంలో పడింది. ఇప్పుడు 'అవెంజర్స్‌' హీట్‌ కాస్త తగ్గింది. ఇక వచ్చే వారానికి 'మహర్షి' రెడీగా ఉన్నాడు. ఇక మే 17న 'అర్జున్‌ సురవరం' విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనీ సమాచారం.

 

అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆల్రెడీ మే 17న అల్లు వారబ్బాయ్‌ శిరీష్‌ 'ఏబీసీడీ' సినిమాతో స్లాట్‌ బుక్‌ చేసుకుని సిద్దంగా ఉన్నాడు. అయితే 'ఏబీసీడీ'తో 'అర్జున్‌ సురవరం'కు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. అదో కూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ. 'అర్జున్‌ సురవరం' ఒక ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ. డిఫరెంట్‌ జానర్ మూవీస్‌ కాబట్టి, ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద అడ్జస్ట్‌ చేసుకోగలవు. అయితే 'అర్జున్‌ సురవరం' విడుదలకు లైన్‌ క్లియరేనా? అంటే ఏమో అనుమానమే అనిపిస్తోంది. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్‌ సురవరం'లో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్డ్‌ హీరోగా నటిస్తుండగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది.

ALSO READ: AVENGERS CONTINUE TO DOMINATE GLOBAL BOX-OFFICE