ENGLISH

అవినాష్‌ వెనుక ‘బిగ్‌’ మిస్టరీ ఏంటి!

09 November 2020-16:00 PM

అవినాష్‌, బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. జబర్దస్త్‌ అవినాష్‌ వేరు, బిగ్‌బాస్‌ అవినాష్‌ వేరు. రియాల్టీ షోలో రియల్‌ కలర్స్‌ చూపించాలనుకుంటున్నాడా.? లేదంటే, ఇచ్చిన స్క్రిప్ట్‌ మేరకు అవినాష్‌ నటిస్తున్నాడా.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. ‘నువ్వెంత సీరియస్‌గా వున్నా, కామెడీనే..’ అని హోస్ట్‌ అక్కినేని నాగార్జున, ఒకానొక సందర్భంలో తేల్చి చెప్పేశాడు. ఇంకెందుకు బిగ్‌హౌస్‌లో అవినాష్‌ని కొనసాగించడం.? అన్న చర్చ జరుగుతోంది బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో. కానీ, అవినాష్‌ లేకపోతే బిగ్‌బాస్‌కి ‘కళ’ లేనట్టే. అందుకే, అతన్ని కొనసాగిస్తున్నారు.

 

అయితే, ఎమోషనల్‌ సీన్స్‌లో అవినాష్‌ ‘అతి’ చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హౌస్‌ నుంచి ఎవిక్ట్‌ అవడం అనేది సాధారణ ప్రక్రియే. ఈ మాత్రందానికి ‘ఒక్క క్షణం గుండె ఆగిపోయింది..’ అని అన్నాడు అవినాష్‌, ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డాక. అంతే కాదు, బోరున ఏడ్చేశాడు.. ఇంకవేవో చేసేశాడు. అంతకు ముందు, ఎలిమినేషన్‌ కోసం అమ్మ రాజశేఖర్‌తో కలిసి ‘బూత్‌’లలోకి వెళ్ళేముందు అరియానా, ‘నువ్వేమీ చేసుకోకు.. నీ ప్రాణం నీకు, నాకు కూడా ముఖ్యం.. నేను బయటకు వచ్చేవరకు ఎలాంటి అఘాయిత్యమూ చేసుకోనని మాటివ్వు..’ అంటూ ఏడ్చేసింది.

 

అంటే, అవినాష్‌ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ మిస్టరీ చాలానే వుందన్నమాట.. ఆ స్థాయిలో అతనికి కష్టాలేమున్నాయి.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. నవ్వు వెనుక బాధ ఖచ్చితంగా వుంటుంది ‘జోకర్‌’ విషయంలో.. అన్న కాన్సెప్ట్‌ని నిజం చేస్తున్నాయి ఈ సంఘటనలు. అయితే, ఇందులో రియాల్టీ ఎంతన్నది మాత్రం చెప్పలేం.

ALSO READ: త‌మ‌న్నా 11వ గంట‌లో ఏం చేసింది?