ENGLISH

బాహుబ‌లి రేటు అదిరింది గురూ!

13 March 2017-12:56 PM

బాహుబ‌లి 2 హంగామా మొద‌లైపోయింది. చిత్ర‌బృందం రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తోంది. ఈనెల 16న ట్రైల‌ర్ చూపించ‌బోతోంది. 26న పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. బాహుబ‌లి 2 ఆడియో పోగ్రాంని లైవ్ ఇచ్చేందుకు టీవీ ఛాన‌ళ్లు పోటీ ప‌డ్డాయి. మాటీవీ, టీవీ 9, ఎన్ టీవీలు ఆ హ‌క్కుల్ని కైవ‌సం చేసుకొన్నాయి. కేవ‌లం ఆడియో రిలీజ్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి ఈ మూడు టీవీ ఛాన‌ళ్లు క‌లిపి దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కూ స‌మ‌ర్పించుకొన్నాయ‌ట‌. 26న హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో బాహుబ‌లి 2 ఆడియో వేడుక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆర్ ఎఫ్ సీలో మ‌హీష్మ‌తీ సెట్ వేశారు. అక్క‌డే పాట‌ల్ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. 

ALSO READ: గ్యాంగ్ స్ట‌ర్‌గా బాల‌య్య‌