ENGLISH

బాహుబలి - రక్తంతో హోలీ!

13 March 2017-12:12 PM

హోలీ పండగ సందర్భంగా 'బాహుబలి' యూనిట్‌ 12 సెకెన్ల నిడివిగల ఓ టీజర్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ ఫేస్‌ సగం మాత్రమే కనిపిస్తోంది. అది కూడా రక్తమోడుతూ. పక్కన ఓ 'గింజ' ఆకృతిలో ఉన్న వస్తువేదో కన్పిస్తోంది. దాని మీదుగా కూడా రక్తం ధారలా కారుతోంది. సినిమా ప్రమోషన్‌ని ఉధృతం చేసిన 'బాహుబలి' టీమ్‌ వెరైటీ కాన్సెప్ట్‌లతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తోందనడానికి ఇదొక నిదర్శనం. ఈ మధ్యనే ఓ చిన్న పిల్లాడిని 'కట్టప్ప' పాత్రధారి సత్యరాజ్‌ ఎత్తుకున్నట్లుగా ఓ ఫొటో విడుదలయ్యింది. ఆ ఫొటో కిందనే బాహుబలిని కట్టప్ప కత్తితో పొడుస్తున్న ఫొటోని కూడా మిక్స్‌ చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఇఫ్పుడు తాజాగా విడుదలైన 'టీజర్‌' లాంటి ఓ వీడియో ఇంకా సంచలనంగా మారింది. మార్చ్‌ 16న 'బాహుబలి ది కంక్లూజన్‌' ట్రైలర్‌ రానుంది. ముందుగా ఈ ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం దీన్ని సోషల్‌ మీడియాలో విడుదల చేయనున్నారు. ఏదేమైనప్పటికీ బిజినెస్‌ పరంగా ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్‌లో కూడా అందరూ చర్చించుకునే సినిమా అన్న గుర్తింపు పొందింది. ది కంక్లూజన్‌ పేరుతో రెండో పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న జక్కన రికార్డుల్ని ఎలా కంక్లూడ్‌ చేస్తాడో చూడాలిక. 

ALSO READ: Qlik Here For The Teaser