ENGLISH

బాబు బాగా బిజీకి సెన్సార్ రిలీఫ్

14 April 2017-18:51 PM

అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ సెన్సార్ బోర్డు నుండి అభ్యంతరాలు ఎదురైనా నేపధ్యంలో బాబు బాగా బిజీ మూవీ పరిస్థితి డోలాయమానంలో పడింది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, బాబు బాగా బిజీ కి సెన్సార్ వారు A సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. ఇక దీనితో సినిమా రిలీజ్ పై ఉన్న సందేహాలు అన్ని పటాపంచలు అయ్యాయి.

ఇంతకముందే ఈ చిత్రం మే 5వ తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ తాజాగా తలెత్తిన పరిస్థితుల నడుమ మరొకసారి రిలీజ్ డేట్ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ బోల్డ్ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.