ENGLISH

70 అనుకుంటే 100 అవుతోంది!

15 December 2020-10:00 AM

క‌రోనా ఎఫెక్ట్ చిత్ర‌సీమ‌పై విప‌రీతంగా ప‌డింది. బ‌డ్జెట్లు త‌గ్గించుకోవాల్సిన అవస‌రం ఏర్ప‌డింది. పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని, సినిమాని వీలైనంత త‌క్కువ పెట్టుబ‌డితో ముగించాల‌ని నిర్మాత‌లు భావించినా, అందుకు ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి, దర్శ‌కులు త‌మ సినిమా బ‌డ్జెట్ కుదించ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. తాజాగా.. బాల‌య్య సినిమాకి బ‌డ్జెట్ త‌డిసిమోపెడ‌వుతోంద‌ని టాక్‌.

 

బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గానూ 70 కోట్ల బ‌డ్జెట్ అనుకున్నారు. బాలయ్య సినిమా కి 70 కోట్లంటే ఎక్కువ‌. కాక‌పోతే కాంబినేష‌న్ ప‌రంగా క్రేజ్ ఉంది కాబ‌ట్టి, ఖ‌ర్చు పెట్టే సాహ‌సం చేస్తున్నారు. కానీ... ఇప్పుడు ఆ 70 కాస్త 100 కోట్ల‌య్యింది టాక్‌. లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఫైనాన్స్ కి తెచ్చిన డ‌బ్బుల‌కు వ‌డ్డీ పెరుగుతోంది. ఇదంతా సినిమా బ‌డ్జెట్ పై విప‌రీత‌మైన ప్ర‌భావం చూపించింద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా పూర్త‌య్యేస‌రికి 100 కోట్లు దాటేసినా ఆశ్చర్య‌పోవాల్సిన ప‌నిలేదట‌. బాల‌య్య సినిమాకి వంద కోట్లంటే... నిర్మాత‌కు పెద్ద రిస్కే.

ALSO READ: టాలీవుడ్‌లో దీపిక డబుల్‌ ధమాకా.?