ENGLISH

98 రోజుల్లో 30 ల‌క్ష‌లు!

15 December 2020-09:25 AM

ఎట్ట‌కేల‌కు బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది మోనాల్ గ‌జ్జ‌ర్‌. దాదాపు వంద రోజుల ప్ర‌యాణం పూర్త‌య్యాక‌... ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మోనాల్ ఇన్ని రోజులు ఉంటుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. ప్ర‌తీ వారం.... ఎలిమినేష‌న్‌రిస్క్ ఫేస్ చేస్తూనే ఉంది మోనాల్. బిగ్ బాస్‌... మోనాల్ ని కావాల‌ని కాపాడుతున్నాడ‌ని, అందుకే మోనాల్ కంటే టాలెంటెడ్ కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నా, మోనాల్ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌గ‌లుగుతోంద‌ని చెప్పుకున్నారు. చివ‌రకి.. మోనాల్ ని ఎవ‌రూ కాపాడ‌లేక‌పోయారు. 98 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి.. బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

 

ఈ 98రోజుల‌కు మోనాల్ ఎంత పారితోషికం అందుకుంది? అనే విష‌యం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మోనాల్ రోజువారీ పారితోషికం 30 వేల‌ని, ఈ లెక్క‌ని తాను 30 లక్ష‌ల వ‌ర‌కూ అందుకుని ఉంటుంద‌ని తెలుస్తోంది. బిగ్ బాస్ విన్న‌ర్ కి 50 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఆ లెక్క‌న మోనాల్.. బాగానే సంపాదించిన‌ట్టు. మోనాల్ ఓ సినిమా చేసినా ఎప్పుడూ 30 ల‌క్ష‌లు తీసుకోలేద‌ని, ఈ లెక్క‌న ఓ సినిమాకంటే ఎక్కువ‌గానే సంపాదించినంద‌న్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ ద‌య వ‌ల్ల‌ మోనాల్ బాగానే ఆర్జించింది.

ALSO READ: టాలీవుడ్‌లో దీపిక డబుల్‌ ధమాకా.?