ENGLISH

టాలీవుడ్‌లో దీపిక డబుల్‌ ధమాకా.?

14 December 2020-16:53 PM

తెలుగు సినీ పరిశ్రమలోకి బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే అడుగు పెట్టబోతోంది. అదీ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం దీపికా పడుకొనే పేరుని హీరోయిన్‌గా ఖరారు చేసిన విషయం విదితమే. అయితే, ఈ సినిమా ఎప్పటినుంచి సెట్స్‌ మీదకు వెళుతుంది.? అన్నదానిపై కొంత గందరగోళం వుంది.

 

ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' సినిమా పనుల్లో బిజీగా వున్న ప్రభాస్‌, ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేయాల్సి వుంది. అందులో ఒకటి 'ఆది పురుష్‌' కాగా, మరొకటి 'సలార్‌'. మరి, నాగ్‌ అశ్విన్‌తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? ఏమో, ఈ ప్రశ్నకైతే ప్రస్తుతానికి సమాధానం దొరకడంలేదు. ఇదిలా వుంటే, మొదటి సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేదుగానీ, అప్పుడే దీపికా పడుకొనే పేరుని ఇంకో సినిమాకి కనెక్ట్‌ చేసేస్తున్నారు టాలీవుడ్‌లో కొందరు.

 

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దీపిక రెండో తెలుగు సినిమా కూడా ఖరారైపోయిందట. అయితే, ప్రస్తుతానికి ఆ వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. ఓ ప్రముఖ టాలీవుడ్‌ బ్యానర్‌లో ఓ యంగ్‌ హీరో సరసన దీపికా పడుకొనే హీరోయిన్‌గా నటించడానికి ఓకే చెప్పిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, తొలి ప్రాజెక్ట్‌ కాస్త వెనక్కి వెళ్ళి, రెండో ప్రాజెక్ట్‌ ముందుకు రాబోతోందట దీపికా పడుకొనే విషయంలో. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే దీపిక నటించబోయే ఆ రెండో సినిమా పట్టాలెక్కనుందనేది టాలీవుడ్‌ వర్గాల్లో విన్పిస్తోన్న లేటెస్ట్‌ గాసిప్‌.

ALSO READ: సూర్య ప‌క్క‌న కృతి?