ENGLISH

బాల‌య్య దూకుడే దూకుడు

18 December 2020-09:30 AM

ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఓ సినిమా చేస్తున్న‌న్న‌ప్పుడు దానిపైనే శ్ర‌ద్ధ చూపించ‌డం.. బాల‌య్య స్టైల్‌. మ‌రో క‌థ విన‌డం, ఓకే చేయ‌డం చాలా త‌క్కువ‌. ఈసారి అలా కాదు. బోయ‌పాటి శ్రీ‌ను సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రికొన్ని క‌థ‌లు ఓకే చేసుకుంటున్నాడు.

 

ఇటీవ‌ల‌.. సంతోష్ శ్రీ‌నివాస్ లాంటి యువ ద‌ర్శ‌కులు బాల‌య్య‌కు క‌థ‌లు చెప్పారు. ఆ జాబితాలో కె.ఎస్‌.ర‌వికుమార్ కూడా ఉన్నాడు. ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని కూడా ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ‌ని మైత్రీ మూవీస్ సంస్థ లాక్ చేసింద‌ని స‌మాచారం. బాల‌య్య‌తో మైత్రీ మూవీస్ ఇది వ‌ర‌కే ఓ సినిమా కోసం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు బాల‌య్య - గోపీచంద్ మ‌లినేని - మైత్రీ మూవీస్ కాంబినేష‌న్ సెట్ట‌య్యేఅవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

ALSO READ: అబిజీత్‌కి ఓటింగ్‌ ఆ స్థాయిలో వుందా.?