ENGLISH

ఆ ఉద్దేశ్యం లేదంటోన్న సోనూసూద్‌

17 December 2020-17:15 PM

కరోనా నేపథ్యంలో రాత్రికి రాత్రి అనూహ్యమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు సోనూ సూద్‌. అంతకు ముందు అతను పేరున్న నటుడు. కానీ, ఇఫ్పుడాయన 'గ్రేటెస్ట్‌ హ్యూమన్‌బీయింగ్‌'. 'దానకర్ణుడు' అనే బిరుదు బహుశా ఈ జనరేషన్‌లో సోనూ సూద్‌కే ఇచ్చేయాలేమో. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అలాంటివి. ఈ నేపథ్యంలో సోనూ సూద్‌, నెగెటివ్‌ రోల్స్‌ చేయకూడదని డిసైడ్‌ అయ్యాడట.. అన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. కానీ, సోనూ సూద్‌ మనసులో ఏముంది.? అంటే, అసలు ఆ ఉద్దేశ్యమే ఆయనకు లేదన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. 'ఇలాంటి గాసిప్స్‌ ఎలా పుడతాయో కూడా నాకు అర్థం కావడంలేదు..' అంటూ సోనూ సూద్‌ ఆందోళన చెందుతున్నాడట.

 

'నేను హీరోగా సినిమాల్లో నటిస్తే ఎవరు చూస్తారు.? నటన అంటే అందులో అన్నీ వుంటాయి. నేను విలన్‌ క్యారెక్టర్స్‌ చేస్తే, జనం నన్ను విలన్‌లా చూస్తారనుకోవడం పొరపాటు..' అని సోనూ సూద్‌ అంటున్నాడట. 'దయ చేసి నా కెరీర్‌ మీద కొట్టొద్దు..' అంటూ సదరు గాసిప్స్‌పై సోనూ సూద్‌ స్పందించాడని సమాచారం. సోనూ సూద్‌ మాత్రమే కాదు, చాలామంది విలన్లు.. నిజ జీవితంలో చాలా చాలా మంచోళ్ళు.

 

కొందరు హీరోలు రియల్‌ లైఫ్‌లో విలన్లుగా బిహేవ్‌ చేయడం చూస్తుంటాం. సమాజంలో రకరకాల వ్యక్తిత్వంగల వ్యక్తులుంటారు. ప్రొఫెషన్‌ వేరు, రియల్‌ లైఫ్‌ వేరు. అయినా, సోనూ సూద్‌ కొన్ని సినిమాల్లో పాజిటివ్‌ క్యారెక్టర్లు కూడా చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ALSO READ: గువ్వ - గోరింక‌ మూవీ రివ్యూ & రేటింగ్!