ENGLISH

మెగాస్టార్‌ లెక్కలు 'మెగా లెవల్‌'లోనే వుంటాయ్‌.!

17 December 2020-16:12 PM

సుజీత్‌ అనుకున్నారు.. వినాయక్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.. ఇంతలో అనూహ్యంగా మోహన్‌ రాజా పేరు ఖరారయ్యింది. ఇదంతా 'లూసిఫర్‌' రీమేక్‌ వ్యవహారం. తెరవెనుక ఏం జరిగిందట.? 'లూసిఫర్‌' రీమేక్‌ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా సుజీత్‌ పేరుని తెరపైకి తెచ్చిన మాట వాస్తవం. కానీ, ఏం జరిగిందో సుజీత్‌.. ఆ ప్రాజెక్ట్‌ నుంచి ముందే తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు తమిళ దర్శకుడు మోహన్‌ రాజా పేరు అయినా చివరి వరకు వుంటుందా.? అంటే, దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి వుంది.

 

సినీ పరిశ్రమలో ఇలాంటి మార్పులు సహజం. సుకుమార్‌తో చెయ్యాల్సిన సినిమాని పక్కన పెట్టి, మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేసెయ్యలేదా.? ఈక్వేషన్స్‌ ఇలాగే మారిపోతుంటాయి. కాగా, ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమాని పూర్తి చేయాల్సి వుంది. అది అలా జరుగుతూనే వుంటుంది, ఈలోగా 'లూసిఫర్‌' పట్టాలెక్కేస్తుందని మెగా క్యాంప్‌ అంటోంది.

 

కేవలం మూడు నెలల్లోనే 'లూసిఫర్‌' షూటింగ్‌ పూర్తయిపోతుందట. ఇదీ తాజా ఖబర్‌. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి షెడ్యూల్స్‌ ఎవరైనా వెల్లడిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎందుకంటే, ఇది కరోనా కాలం. దానికి తోడు, సినిమా థియేటర్లే ఇంకా పూర్తిస్థాయిలో తెరచుకోలేదాయె. ఏదిఏమైనా, మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం, 'ఆచార్య' తర్వాత, 'లూసిఫర్‌' కూడా వేగంగా చేసేస్తే, ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ మీద ఫోకస్‌ పెట్టబోతున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ALSO READ: గువ్వ - గోరింక‌ మూవీ రివ్యూ & రేటింగ్!