ENGLISH

అక్కినేని తొక్కినేని .... ఇదీ బాలయ్య వివరణ

26 January 2023-18:37 PM

‘వీరసింహరెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన అక్కినేని తొక్కనేని కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై అక్కినేని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం..’’ అని నాగచైతన్య, అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

 

అయితే తాజాగా ఈ వివాదంపై బలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అక్కినేనిని కించపరిచేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప.. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు. ‘అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్‌ అని పిలుస్తా. తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ నాపై చూపించేవారు. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన వద్దే నేర్చుకున్నా’’ చెప్పుకొచ్చారు. ‘’తాడో పేడో అంటాం.. అందులో పేడో అంటే ఏమిటి ..? జనరల్ గా మాట్లాడిన మాటల్లో వివాదాలు వెదికితే నేనేం చేయాలని, ప్రజలకు ఎవరు ఎలాంటి వారో తెలుసని’’ తేల్చి పాలేశారు బాలయ్య.