ENGLISH

చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన బాలయ్య

01 September 2017-00:58 AM

బాలయ్య అంటేనే ఉన్నది ఉన్నట్టుగా ముఖంమీదే చెప్పే మనస్తత్వం ఉన్న మనిషి అని అందరికి తెలుసు.

ఇక ఆయన ఈరోజు ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినీ రంగానికి చెందిన వారు రాజకీయాలకు పనికిరారు అని తేల్చి చెప్పేశాడు. ఉదాహరణకి ఆయన లెజెండరీ హీరో అయిన అమితాబ్ బచ్చన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి పేర్లు ఉదహరించడం సంచలనం రేపుతున్నది.

 

అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగింది తన తండ్రిగారైన ఎన్టీఆర్ గారేనని చెబుతూ, తమ కుటుంబానికి, తమ రక్తానికే ఇది సాధ్యపడే అంశం అని చెప్పడం కొసమెరుపు.

ఇదంతా తాను నటించిన పైసా వసూల్ చిత్ర విడుదలకి సంబందించిన ప్రమోషన్స్ లో జరగడం విశేషం.

 

 

ALSO READ: 'డేరా బాబా' వర్మ కొత్త సినిమా?