ENGLISH

బాలయ్యతో గోపీచంద్ మలినేని.. పాత కథ

04 February 2021-11:00 AM

'క్రాక్' తో మాస్ హిట్ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. సంక్రాంతి విజేతగా నిలిచింది 'క్రాక్‌. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ కేక్ గా మారారు. అయితే ఇప్పుడు మలినేని కొత్త సినిమా ఖరారైయింది. నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నారు మలినేని. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఆ చిత్రం మే నుంచే పట్టాలెక్కించే అవకాశం వుంది. నిజానికి బాలయ్యతో లాక్ డౌన్ కి ముందే కథ చర్చలు జరిపారు గోపిచంద్ మలినేని. అప్పట్లో సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నారు.

 

అయితే ఈ గ్యాప్ లో కరోనా వచ్చి పడింది. లాక్ డౌన్ తర్వాత మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడిగా మారారు మలినేని. దీంతో బాలయ్య నుండి కబురు రావడం, ఓకే చేయడం.. చకచక జరిగిపోయాయి. అయితే లాక్ డౌన్ సమయంలో ఓ పవర్ ఫుల్ కథ రాసుకున్నారు గోపీచంద్. కానీ బాలయ్య తో చేయాబోతున్న సినిమా మాత్రం గతంలో లాక్ చేసిన కథని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.

ALSO READ: ఒక్క సినిమాకే రేటు పెంచేసిందా?