ENGLISH

ఒక్క సినిమాకే రేటు పెంచేసిందా?

04 February 2021-10:10 AM

చిత్ర‌సీమ‌లో... స‌క్సెస్ కి సౌండ్ ఎక్కువ‌. చేతిలో హిట్టున్న వాళ్ల మాటే చెల్లుబ‌డి అవుతుంది. ఒక్క హిట్టు చాలు. జాత‌కాలు తారుమారు అవ్వ‌డానికి. శ్రుతిహాస‌న్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. మొన్న‌టి వ‌ర‌కూ శ్రుతిని ప‌ట్టించుకున్న‌వాళ్లే లేరు. కానీ `క్రాక్` హిట్ తో అనూహ్యంగా తాను ఫామ్ లోకి వ‌చ్చేసింది. `క్రాక్‌` హిట్ట‌వ్వ‌డం, `వ‌కీల్ సాబ్‌`లాంటి సినిమా త‌న చేతిలో ఉండ‌డంతో.. శ్రుతిలో ఇప్పుడు స‌రికొత్త జోష్ వ‌చ్చింది. దాంతో పాటు పారితోషికం కూడా అమాంతంగా పెంచేసింది.

 

ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `స‌లార్‌`. ఇందులో శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. ఈ చిత్రం కోసం శ్రుతి కోటి రూపాయ‌ల పారితోషికం డిమాండ్ చేసింద‌ని టాక్‌. `క్రాక్‌`కి త‌న‌కు 50 ల‌క్ష‌లే దక్కాయి. `వ‌కీల్ సాబ్‌`కి అదికూడా లేద‌ట‌. అయితే `క్రాక్‌` హిట్ట‌వ్వ‌డంతో.. త‌న పారితోషికాన్ని అమాంతంగా పెంచేసింద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప‌క్క‌న శ్రుతి బాగా ఫిట్ అవుతుంద‌ని భావించిన స‌లార్ నిర్మాత‌లు.... శ్రుతి అడిగినంత ఇవ్వ‌డానికి ఒప్పుకున్నారు. ఇక `వ‌కీల్ సాబ్` కూడా హిట్ట‌యిపోతే... చిన్న నిర్మాత‌ల‌కు శ్రుతి అంద‌దేమో..?

ALSO READ: Shruti Haasan Latest Pics