ENGLISH

బాలయ్య ఎనర్జీకి ఆకాశమే హద్దు

30 August 2017-19:07 PM

బాలకృష్ణ - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'పైసా వసూల్‌' సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బాలయ్య జోరుగా పాల్గొంటున్నారు. ఎక్కడా చూసినా బాలయ్యే అనేంతగా ప్రమోషన్స్‌లో బాలయ్య పర్‌ఫామ్‌ చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. రానా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బుల్లితెర ప్రోగ్రాం 'నెం.1 యారీ' లో బాలకృష్ణ సందడి చేశారు. ప్రతీ ఆదివారం ఈ ప్రోగ్రాం బుల్లితెరలో ప్రసారమవుతూ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్‌ ఈ షోలో సందడి చేశారు. అయితే ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాంలో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. . దానికి సంబంధించిన ఓ టీజర్‌ని సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు రానా. అందులో బాలయ్య ఎనర్జీని చూసి ఆయనకు హేట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరెవరూ. 'పైసావసూల్‌' సినిమా ప్రోమోస్‌లో బాలకృష్ణ ఎంత ఎనర్జీతో కనిపిస్తున్నాడో, అంతకన్నా ఎక్కువ ఎనర్జీ చూపిస్తూ 'నెం.1 యారీ' సెట్‌లో సందడి చేశాడు. మామూలుగా అయితే స్టార్‌ హీరోలు ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చాలా డిగ్నిఫైడ్‌గా కూర్చుంటారు. ఎందుకంటే ఫ్యాన్స్‌ ఎక్కడ ఓవర్‌ యాక్షన్‌ చేశామనుకుంటారో అని చాలా ఇబ్బందిగా కూర్చుంటారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదు, డాన్సులేశారు. తన స్టైల్లో మాస్‌ డైలాగులు ఇరగదీసేస్తూ రానాని నవ్వుల్లో ముంచేశారు. ఈ టీజర్‌కి వస్తోన్న రెస్పాన్స్‌ని బట్టి, ఇన్ని రోజుల ఈ ప్రోగ్రాంలో బాలయ్య గెస్ట్‌గా వస్తోన్న ఈ వారం ఈ షో సూపర్‌ సక్సెస్‌ అందుకోనుందనే అనిపిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో బాలకృష్ణతో పాటు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కూడా పార్టిసిపేట్‌ చేశారు.

ALSO READ: అర్జున్ రెడ్డి కథని కాపీ కొట్టారా?