ENGLISH

బాలయ్య జై సింహ స్పెషల్ షోల వివరాలు

11 January 2018-18:28 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ జై సింహ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఆయన అభిమానులకి మాత్రం నేటి అర్దరాత్రి నుండే స్పెషల్ షోల రూపంలో సినిమా విడుదల అవుతున్నది.

ఇందుకుగాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జారీ చేసిన ప్రకటన ఆధారంగా జనవరి 12 నుండి 17వ తేదీ వరకు రాత్రి ఒంటిగంట నుండి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకి అనుమతి ఇచ్చారు. దీనితో ధియేటర్స్ లో అధిక టికెట్ రేట్లు, బ్లాక్ టికెట్లకి చెక్ పెట్టొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి అర్దరాత్రి నుండే జై సింహ కి సంబందించిన షోలు అలరించనున్నాయి. మొన్న విడుదలైన అజ్ఞాతవాసి సినిమాకి కూడా ఇదే తరహాలో ప్రత్యేక అనుమతిని AP ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.

ఈ వార్త బాలయ్య అభిమానులకి తప్పక కిక్ ఇస్తుంది.

 

ALSO READ: అజ్ఞాతవాసి టీంకి ఫ్రెంచ్ దర్శకుడి హెచ్చరిక!