ENGLISH

బాలయ్య ఆ ప్రయత్నాలు మొదలెట్టేశాడట

27 October 2020-15:00 PM

‘నర్తనశాల’ పేరుతో విజయదశమి సందర్భంగా నందమూరి బాలకృష్ణ పబ్లిసిటీ స్టంట్లు చేశారనే విమర్శలు చాలా గట్టిగా వినిపించాయి. ‘నర్తనశాల’ బాలయ్య డ్రీవ్‌ు ప్రాజెక్ట్‌. అనివార్య కారణాలతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికి పూర్తయిన షూటింగ్‌కి సంబంధించి కొంత ఫుటేజ్‌ని, దానికి అదనంగా స్వర్గీయ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫుటేజ్‌ని జోడించి ఓటీటీ ద్వారా చిన్న వీడియో లాంటిది విడుదల చేశారు. ఇక, అది కాస్తా బెడిసికొట్టేసరికి, బాలయ్య ఈసారి ఎలాగైనా పూర్తిస్థాయిలో ‘నర్తనశాల’ సినిమా చేస్తాననే కసితో వున్నారట నందమూరి బాలకృష్ణ.

 

నిజానికి ఈ ప్రయత్నం ఇప్పటిదికాదు.. చాలాకాలం క్రితం నుంచీ జరుగుతున్నదే. అయితే, బాలయ్య కోరుకున్న విధంగా నటీనటులు దొరకడంలేదు. కాగా, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఇప్పటికే నటీనటుల వేట ప్రారంభించారట. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులుంటారట. కొంత భాగం బాలయ్యే దర్శకత్వం వహిస్తారట.. తనకు తోడుగా మరో ప్రముఖ దర్శకుడ్ని ఈ సినిమా కోసం బాలయ్య వినియోగిస్తారట. అన్నీ కుదిరితే, సంక్రాంతి లోగానే ఓ ప్రకటన రావొచ్చనే ప్రచారం జరుగుతోంది.

 

ఈసారి గతంలోలా ప్రారంభించేసి ఆపేయకుండా, వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: పవన్‌తో పూజా హెగ్దే డబుల్‌ ధమాకా?