ENGLISH

నర్తనశాల: బాలయ్యకు హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.!

22 October 2020-18:00 PM

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా ‘నర్తనశాల’. ఆ సినిమా ప్రారంభమయినప్పటినుంచీ అనేక అవాంతరాలు. ఈ నేపథ్యంలో బాలయ్యే ఆ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. కొంతమేర షూటింగ్‌ జరుపుకున్న ఆ సినిమాని విజయదశమి నేపథ్యంలో అందరి ముందుంచబోతున్నారు బాలకృష్ణ. అందులో ఏముంటుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ చెడగొట్టేశారు.. ఇదెందుకు.? అన్న విమర్శ కొందరి నుంచి రావొచ్చుగాక. కానీ, బాలయ్య ప్రయత్నాన్ని చాలామంది అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా రియల్‌ స్టార్‌ శ్రీహరి, సహజ నటి సౌందర్య.. మళ్ళీ మనముందుకు రాబోతున్నారంటే, అది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం.

 

సౌందర్య లేని లోటుని ఇప్పటిదాకా ఎవరూ భర్తీ చేయలేకపోయారు. శ్రీహరిని రీప్లేస్‌ చేసే నటుడు ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమకు దొరకలేదు. ఆయా వ్యక్తుల గొప్పతనం, వారు లేనప్పుడే తెలుస్తుందన్నది ఈ ఇద్దరి విషయంలో ఇంకోసారి నిరూపితమయ్యింది. సౌందర్య లుక్‌ విడుదలయ్యాక, శ్రీహరి లుక్‌ విడుదలయ్యాక.. మొత్తం సినీ పరిశ్రమ, ఎంత గొప్ప నటుల్ని కోల్పోయాం.? అన్న విషయాన్ని ఇంకోసారి మననం చేసుకుంది. ప్రేక్షకులదీ అదే పరిస్థితి. ఈ విషయంలో బాలయ్యకు థ్యాంక్స్‌ చెప్పి తీరాల్సిందే. ‘నర్తనశాల’ బాలయ్య కల. ఆ కల నిజమవుతున్న వేళ, బాలయ్య సెహబాష్‌ అనిపించుకుంటున్నారు అందరితోనూ. పైగా, ఇది ఓ సోషల్‌ కాజ్‌ కోసం చేస్తున్న ప్రయత్నం గనుక విమర్శలకు తావు లేదు.

ALSO READ: వెంకీ రెడీ అయ్యాడు.. 'నార‌ప్ప' స్టార్ట్ అయ్యేది అప్పుడే!