ENGLISH

బాలయ్య 101కి ముహూర్తం పెట్టేశారు!

08 March 2017-15:58 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ తన 101వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయనున్నాడని అందరికి తెల్సిన విషయమే.

అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా రేపు ఉదయం 10గంటలకు పూజ నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే పూరి జగన్నాధ్ షూటింగ్ అలాగే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేయడంతో ఒక్కసారిగా ఈ చిత్రం పై అంచనాలు పదింతలయ్యాయి.

ఈ ప్రతిష్టాత్మకమైన  చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నాడు. ఇక నటినటుల కోసం పూరి క్యాస్టింగ్ కాల్ ఇవ్వడం విశేషం.