ENGLISH

స‌మంత 1+1+1

08 March 2017-14:53 PM

స‌మంత మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసింది. వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయింది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ స‌మంత ఖాళీనే. హాయిగా చైతూ ప‌క్క‌న ఉండి.. చైతూ చేస్తున్న వంట‌ల్ని రుచి చూసి పెడుతోంది. మ‌రోవైపు పెళ్లికి కావ‌ల్సిన ఏర్పాట్లు చూసుకొంటోంది. స‌మంత మూడ్ పూర్తిగా సినిమాల నుంచి యూ టర్న్ తీసుకొని - పెళ్లి వైపుకు వెళ్లిపోయింద‌నుకొన్నారంతా. ఇప్పుడు త‌న దృష్టిని పెళ్లి నుంచి సినిమాల‌వైపుకు మ‌ళ్లించింది. ఒక‌టి కాదు రెండు కాదు... ఒకేసారి మూడు సినిమాల్ని ప‌ట్టాలెక్కించేస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ - సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 22న స‌మంత సెట్లో అడుగుపెట్ట‌నుంది. ఇప్ప‌టికే రాజుగారి గ‌ది 2 షూటింగ్‌లో పాల్గొంటోంది స‌మంత‌. ఇప్పుడు `మ‌హాన‌టి` కి సంబంధించిన క‌బురు కూడా అందేసింది. సావిత్రి జీవిత క‌థ‌తో నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సావత్రిగా కీర్తి సురేష్ న‌టించ‌నుంది. ఇందులో స‌మంత ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. మొత్తానికి మూడు సినిమాల‌తో స‌మంత మూడ్ పూర్తిగా మారిపోయింది. మున్ముందు ఇంకెంత జోరు చూపిస్తుందో మ‌రి.