ENGLISH

Balakrishna: బాలకృష్ణ లైనప్ మాములుగా లేదు

18 January 2023-11:00 AM

'వీరసింహారెడ్డి' తో కొత్త యేడాదిని మొదలుపెట్టారు నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి తో సినిమా సెట్స్ పై వుంది. ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తి చేశారు. అలాగే తర్వాత బాలయ్య లైనప్ కూడా పెద్ద క్యూ వుంది. బోయపాటి శ్రీనుతో ఒక సినిమాకి పచ్చజెండా ఊపారు. రామ్ తో సినిమా చేస్తున్న బోయపాటి అది పుర్తవ్వగానే బాలయ్య సినిమాకి షిఫ్ట్ అవుతారు

 

దర్శకుడు ప్రశాంత్ వర్మతో బాలయ్య సినిమా వుంటుంది. విక్రమ్ స్టయిల్ లో ఒక స్టయిలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయలనే ఆలోచన వున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించనుంది. బింబిసారతో ఆకట్టుకున్న వశిష్ట బాలయ్య కోసం ఒక కథ రాసుకున్నాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. అలాగే దర్శకుడు బాబీ కొల్లి కూడా బాలకృష్ణ లైన్ లో వున్నారు. సితార నాగవంశీ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇవి కాకుండా బిగ్ బాస్ 7 సీజన్ ని హోస్ట్ చేయబోతున్నారు బాలయ్య. మొత్తానికి 2023 బాలయ్య డైరీ నిండిపోయింది.