ENGLISH

Ali, Roja: రోజా ఎలాంటి డైమాండో చెప్పిన అలీ

18 January 2023-10:10 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంత్రి రోజాని ఉద్దేశించి డైమండ్ రాణి అని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తర్వాత.. రోజా డైమండ్ రాణి ఎలా అయ్యింది ? ఆ పేరుతో సినిమా ఏదైనా చేసిందా ? పేకాట ముక్కల్లో డైమండ్ రాణికి రోజాకి ఏదైనా లింక్ ఉందా ? లేదా డైమండ్స్ అంటే రోజాకి ఇష్టమా ? ఇలా రకరకాలుగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అయితే హాస్యనటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ మాత్రం డైమండ్ రాణి అనే పోలికకు అర్ధం చెప్పారు.

 

''పవన్‌ కల్యాణ్ రోజాను డైమండ్‌ రాణి అని విమర్శించారు. రోజమ్మ నిజంగానే కోహినూర్‌ డైమండ్‌తో సమానం. చాలా విలివైనది. పవర్ ఫుల్ '' అని చెప్పుకొచ్చారు అలీ. అంతేకాదు.. ''పవన్‌కల్యాణ్‌ నాకు మంచి మిత్రుడు. అయితే, సినిమాలు, రాజకీయం రెండూ వేరు. పార్టీ ఆదేశిస్తే, పవన్‌పై పోటీచేయడానికి సిద్ధం. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి నేను రెడీగా ఉన్నా. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో వైసీపీ విజయం ఖాయం'' అని జోష్యం చెప్పారు అలీ.