ENGLISH

Prabhas: ప్రభాస్.. రాముడు, రావణుడు !

18 January 2023-09:08 AM

ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మరోసారి రామాయణంలోని పాత్రతోనే మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి రావణం అనే టైటిల్ అనుకుంటున్నారు. రామాయణంలో రావణుడి పాత్ర ఆధారంగా ఇందులో ప్రభాస్ పాత్రని తీర్చిదిద్దారట దర్శకుడు ప్రశాంత్ నీల్.

 

కేజీఎఫ్ తో సంచలనం సృస్టించాడు నీల్. హీరో పాత్రని పూర్తిగా నెగిటివ్ కోణంలో ఒక బ్యాడ్ వరల్డ్ ని క్రియేట్ చేసి అందులోనే విలనీ హీరోయిజం చూపించాడు. ఈ విలనీ హీరోయిజం ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమాలో కూడా హీరో బ్యాడ్ విలన్ గా కనిపించబోతున్నాడు. దిల్ రాజు తో చేయబోయే కథ కూడా ప్రభాస్ ని రావణుడిగా ప్రజంట్ చేస్తోంది.

 

రావణుడు రాక్షసుల రాజు. లంకకు అధిపతి. మాహా బలవంతుడు, శివ భక్తుడు. అతనితో యుద్ధం అంటే దేవతలు సైతం భయపడతారు. గొప్ప మేధావి. శాస్త్రం తెలిసినవాడు. అయితే ధర్మాన్ని ధిక్కరంచడంతో కూలిపోతాడు. రావణుడి పాత్రని సరిగ్గా చూపించాలే కానీ కేజీఎఫ్ తరహా గొప్ప విలనీ హీరోయిజం వుంటుంది. ఇప్పుడు అదే పాత్ర వర్క్ చేసి రావణం చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. అదిపురష్ లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రావణంలో రావణుడిగా కనిపించడంతో రామాయణంలోనే రెండు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం ప్రభాస్ కి దక్కుతోంది.