ENGLISH

'ఆమె' కాన్ఫిడెన్స్‌కి సలాం కొడుతున్న ఫ్యాన్స్‌.!

01 November 2019-15:30 PM

బనితా సందు. ఈ పేరు వినే ఉంటారు. తమిళ సీనియర్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ డెబ్యూ చేస్తున్న 'ఆదిత్య వర్మ' సినిమాతో ఈ పాప కూడా డెబ్యూ చేస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. సినిమా అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందనీ, తన పాత్ర చాలా చాలా బాగుందనీ, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనీ అంటోంది ముద్దుగుమ్మ బనితాసందు.

 

సోషల్‌ మీడియాలో ఓ మోస్తరు ఫాలోయింగ్‌ ఉంది బనితా సందుకి. ఆ ఫాలోయింగ్‌ ఈ సినిమాతో మరింత పెరుగుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది. ధృవ్‌లో మంచి నటుడున్నాడనీ, ఆయన మెచ్యూరిటీ లెవల్స్‌ సూపర్బ్‌ అంటోంది. ధృవ్‌ లాంటి హీరోతో తొలిసారి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. అంతేకాదు, ఆల్రెడీ తెలుగు, హిందీ భాషల్లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా తమిళంలో సంచలనాలు సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతోంది. పాప కాన్ఫిడెన్స్‌కి అందరూ సలాం కొడుతున్నారు.

 

టీజర్‌, ట్రైలర్‌ చూస్తే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. ఏమో సినిమాకి పోజిటివ్‌ రిజల్ట్‌ వస్తుందనడం అతిశయోక్తి కాదేమో. సీనియర్‌ దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్‌ మినిట్‌లో విడుదల రద్దు చేసుకుని, మొదట్నుంచీ మళ్లీ షూటింగ్‌ జరుపుకున్న సంగతి తెలిసిందే. గిరీశయ్య ఈ సినిమాకి దర్‌శకుడు.

ALSO READ: వారసుడి ఎంట్రీ: మోక్షజ్ఞ ఈ సారైనా వస్తాడా?